కొనుగోలుదారులలో విశ్వాసం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు సానుకూల ఫలితాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో గృహ విక్రయాలు ఎనిమిది ప్రధాన గృహ మార్కెట్‌లలో వృద్ధి కనిపించింది. ఇది 2021 సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసంలో 12% వృద్ధిని, 2020 సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసంతో పోలిస్తే నమోదు చేసిందని ప్రోపర్టీ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ నివేదికలో వెల్లడించింది.
రియల్ ఇన్‌సైట్ క్యు1 సీవై21 ప్రకారం, బిల్డర్లు మొత్తం మ్మీద 66,176 గృహాలను జనవరి–మార్చి త్రైమాసం 2021లో ప్రైమరీ మార్కెట్‌లలో విక్రయించారు. మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీతో పాటుగా సర్కిల్ రేట్ తగ్గింపులను చేయడం వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ వృద్ధి చెందడంతో పాటుగా గృహ విక్రయాలపై కూడా ప్రభావం చూపింది.
క్యు1సీవై 20తో పోల్చినప్పుడు, ఈ విశ్లేషణలో పేర్కొనబడిన మార్కెట్‌లలో 5% తగ్గుదల కనిపించింది. క్యు1 సీవై 20లో 69,555 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఈ తగ్గుదల స్వల్పమే. ఎందుకంటే భారతదేశంలో మహమ్మారి ఆరంభం కావడానికి చివరి త్రైమాసంగా జనవరి-మార్చి 2020 ను భావిస్తున్నారు. మార్చి 2020 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఆరంభించింది. తద్వారా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంబించిపోయాయి.
ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. ఇది అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ఆలోచనాపరులు భారతదేశపు వృద్ధి అంచనాలను 2021 మరియు 2022 కోసం పునః సమీక్షించారు. దేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సైతం ఇప్పుడు సానుకూలంగానే స్పందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు మరియు ఆర్‌బీఐ తో పాటుగా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ (గృహ ఋణ వడ్డీరేట్లు తగ్గింపు ద్వారా) తోడ్పాటునందించాయి. ఈ సానుకూల మార్పు మొదటి త్రైమాసంలో సరఫరా సంఖ్యలు పెరగడం ద్వారా కనిపించింది.
లిక్విడిటీ మద్దతు మరియు కొనుగోలుదారుల సెంటిమెంట్ పరంగా డెవలర్లు ఇప్పుడు మరింత సౌకర్యంగా ఉంటున్నారు. డిమాండ్ పరంగా కూడా అధికంగా స్థిరత్వం కనబడుతుంది. పలు పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు ప్రోపర్టీ మార్కెట్‌లో ప్రయోజనాలను తీసుకునేందుకు తగిన విశ్వాసం కలిగిస్తుంది. వాస్తవానికి గృహ కొనుగోలుదారులకు అత్యంత అనుకూలమైన సంవత్సరంగా ఇదినిలుస్తుంది అని ధృవ్ అగర్వాల, గ్రూప్ సీఈఓ, హౌసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ మరియు ప్రాప్ టైగర్ డాట్ కామ్ అన్నారు.
ఇటీవలి కాలంలో కొన్ని మార్కెట్‌లలో కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నా, రెసిడెన్షియల్ మార్కెట్ రికవరీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం అని శ్రీ అగర్వాల జోడించారు. సరఫరా పరంగా, మొత్తంమ్మీద 53,037 యూనిట్లను భారతదేశ వ్యాప్తంగా మూడు నెలల కాలంలో ఆవిష్కరించారు. భారతదేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి మద్దతునందిస్తూ దీర్ఘకాల మూలధన మద్దతునందించేందుకు 20వేల కోట్ల రూపాయల డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్‌ను ఏర్పాటుచేయాలనే బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది గృహ సరఫరా పరంగా ఇయర్ ఆన్ ఇయర్ 49% వృద్ధికి తోడ్పడింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ (క్యుఓక్యు) సరిపోల్చినప్పుడు నూతన ఆవిష్కరణలు 2020 చివరి త్రైమాసంతో పోల్చినప్పుడు 2% తగ్గాయి.
అహ్మదాబాద్ మరియు హైదరాబాద్‌లు తప్ప మిగిలిన చోట్ల ధరలు చాలా వరకూ స్థిరంగా ఉన్నాయి ఊహించిన విధంగానే, ప్రైమరీ లేదంటే నూతన గృహ మార్కెట్‌లలో రమారమి ఆస్తుల ధరలలో పెద్దగా మార్పులేమీ లేవు. వార్షిక వృద్ధి చాలా వరకూ ఫ్లాట్ లేదంటే చాలా వరకూ మార్కెట్‌లలో సింగిల్ డిజిట్ లో తగ్గడం కనిపించింది కానీ అహ్మదాబాద్ మరియు హైదరాబాద్‌లలో ప్రోపర్టీ ధరల పరంగా 5% వార్షిక వృద్ధి కనిపించింది.
ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీని తగ్గించాలనే మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా ముంబై, పూనె మార్కెట్‌లలో అమ్మకాలు గణనీయంగా పడిపోకుండా కాపాడింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా విక్రయం కాకుండా ఉన్న స్టాక్‌కు ఇవి అధిక తోడ్పాటునందిస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ తగ్గించిన ధరలను కొనసాగించడం ద్వారా అమ్మకాల వృద్ధికి తోడ్పాటునందిస్తుంది. యుపీ, హర్యానాలాంటి రాష్ట్రాలు సైతం స్టాంప్ డ్యూటీ మరియు సర్కిల్ రేట్ కోతలను వేస్తాయని అంచనా వేస్తున్నాం. తద్వారా దేశ రాజధాని ప్రాంతమైన నోయిడా, గురుగ్రామ్‌లలోని గృహ మార్కెట్‌కు తోడ్పాటునందించనున్నాయి అని మణి రంగరాజన్, గ్రూప్ సీఓఓ, హౌసింగ్ డాట్ కామ్,. మకాన్ డాట్ కామ్ మరియు ప్రాప్ టైగర్ డాట్ కామ్ అన్నారు.
కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను మరింతగా వృద్ధి చేస్తూ దాదాపు అన్ని బ్యాంకులూ గృహ ఋణ వడ్డీరేట్లను 6.90% స్థాయికి తీసుకువచ్చాయి. ఈ తక్కువ గృహ వడ్డీరేట్లు కొన్నాళ్ల పాటు కొనసాగుతాయని మేము అంచనా వేస్తున్నాం. ఎందుకంటే భారతీయ ఆర్ధిక వ్యవస్థ మహమ్మారి పరిచయం చేసిన జీడీపీ కాంట్రాక్షన్ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తుంది అని రంగరాజన్ జోడించారు.