సోమవారం, 16 ఫిబ్రవరి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2025 (20:21 IST)

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

Butterfly pea flower Blue Tea Benefits
Butterfly pea flower Blue Tea Benefits
నీలి రంగు శంఖు పువ్వులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పువ్వును ఆయుర్వేదం, యునాని వైద్యంలో ఉపయోగిస్తారు. పలు శతాబ్ధాలుగా సంప్రదాయ వైద్య పద్ధతుల్లో దీనిని వాడుతున్నారు. అలాంటి శంఖు పువ్వు టీతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయో తెలుసుకుందాం. 
 
నీలి రంగు శంఖు పువ్వు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. బ్రెయిన్‌కు టానిక్‌గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మెదడును చురుకుగా వుంచుతుంది. యాంటీ ఆక్సిటీని, నరాల బలహీనతను దూరం చేసుకోవాలంటే నీలి శంఖు పుష్పాలతో తయారు చేసే టీని సేవించడం మంచిది. 
 
ఇంకా శంఖు పుష్పాల టీని సేవించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్రలేమి దూరం అవుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు నిండిన శరీర వ్యాధుల నుండి రక్షించబడతాయి. శరీరంలోని టాక్సిన్లను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. 
 
దృష్టి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కళ్లలో ఉన్న పటలాన్ని (గ్లేర్, ఇరిటేషన్) తగ్గించడానికి సహాయపడుతుంది.
 
 శ్వాసకోశ రుగ్మతలను నియంత్రిస్తుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటివాటిని నిరోధిస్తుంది. నీలి రంగు శంఖు పువ్వు మహిళల ఆరోగ్యానికి సహాయపడుతుంది. రుతుక్రమ రుగ్మతలు క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణం ఇందులో ఉంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. వాపును తగ్గించే లక్షణాలు ఈ పువ్వులో పుష్కలంగా వున్నాయి. 
 
దీంతో మంచి పెయిన్ కిల్లర్‌గా ఇది పనిచేస్తుంది. గుండెను ఆరోగ్యంగా వుంచేందుకు రక్తంలో ఒత్తిడిని నియంత్రిస్తుంది. తద్వారా బీపీ కూడా దూరమవుతుంది. ఇంకా యాంటీ-ఏజెంట్‌గా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరకుండా నిరోధిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.