నూతన సాంకేతికతలతో బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం సక్సెస్
భారత రక్షణ - పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరోమారు బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణికి కొత్తగా పలు సాంకేతికతలను జోడించి ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసినట్టు డీఆర్డీవో విడుదలచేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను గురువారం ఒడిశా రాష్ట్ర తీరంలోని బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించినట్టు తెలిపింది.
ఈ మిస్సైల్‌కు కొత్తగా కొన్ని నూతన సాంకేతికతలను జోడించారు. అవి పని చేస్తాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఈ ప్రయోగం మళ్లీ చెపట్టారు. ఇందులో కొత్త సాంకేతికతలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. ఇదిలావుంటే ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను డీఆర్డీవోతో పాటు రష్యాకు చెందిన ఎన్.పి.ఓ.ఎంలు కలిసి అభివృద్ధి చేశాయి.