సోమవారం, 18 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (13:30 IST)

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డు బద్ధలు - సఫారీ గడ్డపై కోహ్లీ ఘనత

భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్‌గా ఖ్యాతికెక్కిన సచిన్ చేసిన రికార్డులు ఒక్కొక్కటిగా బద్ధలైపోతున్నాయి. తాజాగా సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశారు. విదేశీగడ్డలపై సచిన్ టెండూల్కర్ మొత్తం 5,065 చేసిన పరుగుల రికార్డును ఆ రికార్డును విరాట్ కోహ్లీ ఛేదించారు. 
 
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా, బుధవారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ సాధారణ ఆటగాడుగా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌‍లో కోహ్లీ 9 పరుగులు వ్యక్తిగత స్కోరు చేసి సచిన్ రికార్డును క్రాస్ చేశాడు. 
 
ఇదిలావుంటే, విదేశాల్లో వన్డే మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, సచిన్ తర్వాత మూడో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతున్నాడు. ధోనీ విదేశాల్లో వన్డేల్లో 4,520 పరుగుల చేయగా, రాహుల్ ద్రావిడ్ 3,998, గంగూలీ 3,468 చొప్పున పరుగులు చేసి టాప్-5లో ఉన్నారు.