శనివారం, 14 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (14:21 IST)

తొలి వన్డే మ్యాచ్ : తొలిసారి సాధారణ సభ్యుడుగా కోహ్లీ

భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి వన్డే సిరీస్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధారణ సభ్యుడులా మ్యాచ్ ఆడుతున్నాడు. అలాగే, ఈ మ్యాచ్ ద్వారా భారత క్రికెట్ జట్టు తరపున వెంకటేష్ అయ్యర్ తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన భారత జట్టులో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, అశ్విన్, శార్దూల్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌ ఉన్నారు. ఇక సౌతాఫ్రికా జట్టులో కీలక బౌలర్ రబడా మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలు బౌలింగ్ ఎంచుకుంది.