బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (09:40 IST)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు

దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. ముఖ్యంగా, కరోనా వైరస్ థర్డ్ వేవ్ మరింతగా విజృంభిస్తుంది. అలాగే, ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసు ఒకటి నమోదైంది. ఇది ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్లో నొప్పిగా ఉందని ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లగా, అతనికి వైద్యులు నిర్వహించిన వివిధ పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్థారించారు. ఇది బ్లాక్ ఫంగస్ అని వైద్యులు తేల్చారు. అంతేకాకుండా, ఆ వ్యక్తి షుగర్ కారణంగా బ్లాంగ్ ఫంగస్ బారినపడినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సదరు వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు.