సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:11 IST)

యూపీలో అత్తరు వ్యాపారులను టార్గెట్ చేసిన ఐటీ శాఖ - మరో వ్యాపారి ఇంట్లో...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్తరు వ్యాపారుల ఇళ్లను ఆదాయా పన్ను శాఖ అధికారులు టార్గెట్ చేశారు. మొన్నటికిమొన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడుగా భావించే అత్తరు వ్యాపారి పియూష్ జైన్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో రూ.257 కోట్ల నగదు, 250 కేజీల వెండి, 25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు ఒక్క యూపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 
 
తాజాగా మరో అత్తరు వ్యాపారి, ఎస్పీ ఎమ్మెల్సీ పంపి జైన్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. పియూష్ జైన్‌తో పాటు తన వ్యాపారులతో ఎస్పీకి సంబంధం లేదని పంపి జైన్ స్పష్టం చేశారు. పైగా, పియూష్ రాజ్ ఎవరికి సన్నిహితమో వారి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఈయన ఇటీవలే అత్తరు వ్యాపారాన్ని ప్రారంభించారు. పైగా, ఐటీ సోదాలు జరిగిన సమయంలో ఈయన ఇంట్లో లేరు. 90 యేళ్ళ తన తల్లితో కలిసి ముంబైకు వెళ్ళారు. ముంబైలోని కన్నౌజ్‌లో తమ ఇల్లు ఉందని, ముంబైకు యేడాదికి మూడునాలుగు సార్లు వెళుతుంటామని చెప్పారు.