1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (21:21 IST)

ఇకనైనా అహాన్ని వీడాలి.. కోహ్లీపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అహాన్ని తగ్గించుకోవాలని టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సూచించాడు. కొత్త కెప్టెన్ కింద ఆడబోతున్న కోహ్లీ.. తనలోని అహాన్ని ఇకనైనా వీడాలంటూ పేర్కొన్నాడు. కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాడు. ప్రస్తుతం కోహ్లీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని, అతడిపై ఎంతో ఒత్తిడి ఉండి ఉంటుందన్నాడు. 
 
కొత్త కెప్టెన్ కింద ఆడబోతున్న నేపథ్యంలో కోహ్లీ తన మాటలను కాస్త అదుపులో పెట్టుకుంటే మంచిదన్నాడు. కొత్త కెప్టెన్, కొత్త ఆటగాళ్లకు అతడు మార్గదర్శనం చేయాలని సూచించాడు. బ్యాట్స్ మన్ పరంగా చూస్తే కోహ్లీని ఎవరూ వదులుకోలేరని, ఆ చాన్సే లేదని కపిల్ తేల్చి చెప్పాడు.
 
"నేను గవాస్కర్ కెప్టెన్సీలో ఆడాను. కె.శ్రీకాంత్, మహ్మద్ అజారుద్దీన్ కింద కూడా ఆడాను. అప్పట్లో నాకు ఎలాంటి ఈగోలూ లేవు. కోహ్లీ కూడా అహాన్ని వీడాలి" కపిల్ దేవ్ అన్నాడు. దాని వల్ల కోహ్లీతో పాటు జట్టుకు కూడా మంచి జరుగుతుందన్నాడు.