గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (15:44 IST)

కోహ్లీ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం : బీసీసీఐ చీఫ్ గంగూలీ

భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా అది అతని వ్యక్తిగతమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. "ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలోని అన్ని ఫార్మెట్లలో భారత్ క్రికెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. భవిష్యత్‌లోనూ ఈ జట్టును మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలోనూ విరాట్ కోహ్లీ కీలక సభ్యుడుగా ఉంటాడు. విరాట్ అద్భుత ఆటగాడు. వెల్డన్" అంటూ గంగూలీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఇటీవల వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇపుడు బీసీసీఐకు - కోహ్లీకి మధ్య బహిరంగ వార్ జరిగింది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవద్దని తాము కోరామని గంగూలీ చెప్పగా, దాన్ని కోహ్లీ ఖండించారు. అలాగే, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే సమయంలో కూడా గంట ముందు మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని కోహ్లీ ఆరోపించిన విషయం తెల్సిందే.