మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 జనవరి 2022 (23:25 IST)

ఈ జట్టు మనిద్దరం నిర్మించినది, నువ్వు తల పైకెత్తి వెళ్లవచ్చు: కోహ్లి రిటైర్మెంట్ పైన రవిశాస్త్రి

విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కి కూడా బై చెప్పేసాడు. దీనితో అన్ని ఫార్మెట్లను వదిలేసినట్లయింది. దీనిపై రవిశాస్త్రి కాస్తంత ఉద్వేగంగా స్పందించాడు.
 
ట్విట్టర్లో రవిశాస్త్రి ఏమన్నారంటే... విరాట్, నువ్వు తల పైకెత్తి వెళ్ళవచ్చు. కెప్టెన్‌గా కొంతమంది మాత్రమే మీరు సాధించిన ఫీట్లు సాధించారు. ఖచ్చితంగా భారతదేశ జట్టు దూకుడు, విజయవంతమైనదిగా వుంటుంది. ఎందుకుంటే ప్రస్తుతం వున్న జట్టును మనిద్దరం కలిసి నిర్మించిన జట్టు. ఐతే నీ రాజీనామా మాత్రం నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. ఈ రోజు నాకు అలాగే గుర్తిండిపోతుంది.