సంబంధిత వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం జగన్
- నిందితుడికి జడ్జికి లవ్వాయణం.. జైలులోనే లిప్ లాక్ (వీడియో వైరల్)
- కొచ్చి ఎయిర్‌పోర్టు రోడ్డుపై కొండ చిలువ.. వీడియో వైరల్
- Fact Check: దుమ్ము లేపుతూ విమానం క్రాష్ ల్యాండింగ్, వైరల్ వీడియో
- షణ్ముఖ్ దీప్తికి ఇచ్చిన చివరి ముద్దు: మలుపు మేకింగ్ వీడియో వైరల్
లబుషేన్ విచిత్రంగా పెవిలియన్ చేరాడు-వీడియో నెట్టింట వైరల్
Labushen
బంతిని ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వికెట్ ముందు బోర్లాపడ్డాడు. బంతి మాత్రం వికెట్లను ముద్దాడి బెయిల్స్‌ను పడేసింది.
ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేస్తున్న లబుషేన్‌ను ఇలా బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆనందాలకు అవధులే లేకుండా పోయాయి. ఇలా ఊహించని రీతిలో ఔటవ్వడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు ఈ ఆసీస్ బ్యాటర్.
సిరీస్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. నాలుగో టెస్టు డ్రా అవ్వడంతో, ఐదో టెస్టులో గెలిచి సిరీస్‌లో పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది.
ఇంగ్లండ్‌లో అత్యంత విజయవంతమైన రెండో బౌలర్ బ్రాడ్. టెస్టుల్లో అతని పేరు మీద 500 కంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ తరఫున జేమ్స్ అండర్సన్ అతని కంటే ఎక్కువ వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో బ్రాడ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. మునుపటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాను తొమ్మిదో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు. ఖవాజా ఆరు పరుగులు చేశాడు.
One of the weirdest dismissals we've ever seen!
