గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 13 జనవరి 2022 (18:16 IST)

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో వీడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్న సీఎం జ‌గ‌న్

దేశంలో కోవిడ్‌ పరిస్ధితులపై అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సీఎం వైఎస్‌ జగన్ తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్,వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.
 
 
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో వివిధ రాష్ట్రాల‌లో కేసుల సంఖ్య‌, ప‌రిస్థితులు, కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా త‌దిత‌రులు ఈ వీడియో కాన్ష‌నెన్స్ లో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మాట్లాడి ప‌రిస్థితుల‌ను అధ్య‌యనం చేస్తున్నామ‌ని చెప్పారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని సూచించారు.