ఆదివారం, 7 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2025 (16:45 IST)

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

Varalakshmi Sarath Kumar, Naveen Chandra
Varalakshmi Sarath Kumar, Naveen Chandra
చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ  కాన్సెప్ట్‌ గా వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్ షూటింగ్ పూర్తిచేసుకుంది. దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న మూవీ  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వరలక్ష్మి ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో కనిపించ‌నుందని, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణ అని, సూపర్ స్టార్ కృష్ణ గారిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు.

MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపోందుతున్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ మ‌హరాణా నిర్మిస్తుండగా, అఘోర (తెలుగు–తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి ,సప్తగిరి, జెమినీ సురేష్ ,అమిత్, దిల్ రమేష్, పృథ్వీ (యానిమల్) తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌పై ‘పోలీస్ కంప్లెయింట్’  సినిమా నిర్మిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నాం. చిత్ర‌యూనిట్ అంద‌రి స‌పోర్టుతో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశాం, సినిమా అవుట్ ఫుట్ బాగా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కాగానే విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తాము” అని తెలిపారు.
 
‘పోలిస్ కంప్లెయింట్’ టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోందని చిత్ర‌యూనిట్ చెబుతోంది.