మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 13 డిశెంబరు 2021 (18:13 IST)

పట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు... తెలంగాణా హైకోర్టులో కూడా కేసు వేశాడు!

వ‌ద‌ల బొమ్మాళి... నిన్నొద‌ల అన్న‌ట్లు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ కృష్ణం రాజు ప‌ట్టుకుని పీడిస్తున్నాడు. ఆయ‌న‌పై సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ ర‌ద్దు చేయాల‌ని మ‌రో మారు తెలంగాణా హైకోర్టును ఆశ్ర‌యించారు.

 
ఏపీ సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ ను ఈ రోజు తెలంగాణ హైకోర్టు విచారించింది. ఏపీ సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసింది. జగన్ పై 11 ఛార్జిషీట్లు ఉన్నాయని, జ‌గ‌న్ బయట ఉంటే, తన పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన ముగించాలని అన్నారు. 
 
 
జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని ఛార్జిషీట్లపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. నోటీసులకు సీఎం జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురాజు వేసిన పిటిషన్ సిబిఐ కోర్టు కొట్టేసిన విష‌యం తెలిసిందే. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు తెలంగాణా హైకోర్టులో ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.