మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (19:58 IST)

జగన్ వ్యక్తిగత హాజరుపై తీర్పు రిజర్వ్

ఆదాయానికి మించిన కేసులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరుపై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటారు జగన్. అంతేగాకుండా జైలు శిక్ష అనుభవించిన జగన్ బెయిల్‌పై బయట వున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో సీఎం హోదాలో వున్న ఆయన సాక్షులను ప్రభావితం చేసే ఛాన్సుందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
అలాగే ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలన్న జగన్ పిటిషన్ విచారణ కూడా కోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది.
 
తాజాగా నేడు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఎం హోదాలో జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని, అందుకే ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని హైకోర్టును సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు.  
 
అయితే, సీఎం హాదాలో ఉన్న జగన్ బిజీగా ఉంటారని, కాబట్టి ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు…తీర్పును రిజర్వ్ చేసింది.