మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 3 డిశెంబరు 2021 (23:50 IST)

సీఎం జగన్, రోజాల మధ్య ఆత్మీయ పలుకరింపు.. ఆ హామీ ఇచ్చారట

రెండురోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని పలువురు ప్రముఖులు కలిశారు. సిఎం బస చేసిన ప్రాంతంలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు కలిశారు. శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సిఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. 

 
అయితే సిఎం ఎంతోమందితో మాట్లాడారు కానీ నగరి ఎమ్మెల్యే రోజాతో ప్రత్యేకంగా మాట్లాడారట. రోజాను ఆత్మీయంగా పలుకరించారట సిఎం. రోజా కూడా నవ్వుతూ సిఎం జగన్మోహన్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎలా ఉన్నావమ్మా అంటూ సిఎం అడగంతో బాగున్నాను అన్న అంటూ సమాధానమిచ్చారట రోజా. 

 
అంతేకాదు, త్వరలో నువ్వు అనుకున్నది జరుగుతుందని కూడా సిఎం చెప్పి వెళ్లిపోయారట. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో రోజాకు బెర్త్ కన్ఫామ్ అన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఎపిఐఐసి పదవి నుంచి రోజాను పక్కనబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 
 
అయితే ఇక సిఎం మంత్రి పదవిని రోజాకు ఇస్తారో లేదోనన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎంతోమంది ఎమ్మెల్యేలు సిఎంను కలిసినా కూడా రోజాకు మాత్రమే సిఎం హామీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడదే పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ కూడా జరుగుతోందట.