శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 డిశెంబరు 2021 (11:11 IST)

చిత్తూరు-నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన, బాధితులకు పరామర్శ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు తీవ్ర నష్టం చవిచూసాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబరు 2,3 తేదీల్లో ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

 
డిసెంబరు 2న రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 3.30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నష్టాలను పరిశీలిస్తారు. బాధితులను పరామర్శిస్తారు.

 
మరుసటి రోజు ఉదయం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. నెల్లూరులో భారీ వర్షానికి జాతీయ రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు సమర్పించే నివేదికలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు.