శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (15:07 IST)

తిరుపతిలో కుంగుతున్న గృహాలు - భూమి నుంచి పైకొచ్చిన బావి వరలు

తిరుపతి పట్టణం ప్రమాదపుటంచున ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి పట్టణం నీట మునిగిన విషయం తెల్సిందే. ఈ జలదిగ్బంధం నుంచి ఇపుడిపుడే కోలుకుంటుంది. అయితే, తిరుపతి పట్టణంలోని అనేక గృహాలు భూమిలోకి కుంగిపోతున్నాయి. అలాగే, భూమిలోని పాత బావి వరలు పైకి వస్తున్నాయి. 
 
తిరుపతి కార్పొరేషన్ 20వ వార్డు ఎంఆర్ పల్లిలోని శ్రీకృష్ణ నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లో ఉన్న పాత బావి వరలు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చాయి. ఈ బావిని ఎస్వీ యూనివర్శిటీ జియాలజీ విభాగం బృందం పరిశీలించింది. 
 
అలాగే, పలు ప్రాంతాల్లోని గృహాలు పగుళ్లు, బీటలు వారుతున్నాయి. దీంతో అవి ఎక్కడ కూలిపోతాయోనన్న భయంతో ప్రజలు ఇళ్ళను వదిలి ప్రాణభయంతో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు.