మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (14:26 IST)

తిరుపతిలో మళ్లీ భారీ వర్షం .. వణికిపోతున్న పట్టణ వాసులు

తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో పట్టణ ప్రజలు మరోమారు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి పట్టణం జలమయమైన విషయం తెల్సిందే. 400 యేళ్ల చరిత్రలో ఎన్నడూ అలాంటి వరదలు చూడలేదని తిరుపతి పట్టణ వాసులు చెబుతున్నారు. 
 
అయితే, గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలకు బ్రేక్ పడింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మంగళవారం ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో స్థానికులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తమిళనాడు, కర్నాటక, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది తెలిపింది. దీని ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.