సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (11:04 IST)

చొక్కా విప్పి రంగంలో దిగిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

chevi reddy
ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు చేరాయి. దీంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వరద బాధిత ప్రాంతాల ప్రజలకు సహాయ సహకారాలు అందుతున్నాయి.

జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరద ముంపు బారినపడిన గ్రామాలను నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
 
ఈ నిత్యావసరాలు నేవీ హెలికాప్టర్‌లో జిల్లాకు చేరుకున్నాయి. ఆ మూటలను మోసేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి కూడా చొక్కా విప్పి మరీ రంగంలోకి దిగారు.

ఎంతో ఉత్సాహంగా మూటలు మోస్తూ సహాయక చర్యలు సత్వరమే సాగేందుకు తన వంతు కృషి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.