గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (14:47 IST)

చిత్తూరులో భూప్రకంపనలు - భయాందోళనకుగురైన ప్రజలు

చిత్తూరు జిల్లాలో మంగళవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో తమ ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని ఏటీవన్, ఉప్పరపల్లి, కమ్మపల్లి, శిలంవారిపల్లి, ఎస్వీ ఎడ్లపల్లి, ఎస్వీ దళితవాడ, నంజేంపేట దిగువీధి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. 
 
ఈ ప్రకంపనల ధాటికి నిలబడిన వ్యక్తులు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అలాగే, శబ్దాలతో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల ఇళ్ళలో వంటింట్లోని పాత్రలు కిందపడిపోయాయి. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రపంకనలు కనిపించాయి. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు.