మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 నవంబరు 2021 (16:33 IST)

యూఎస్ రోడ్లపై కరెన్సీ నోట్లు... షాకైన జనాలు... ఏరుకునేందుకు..

అమెరికాలోని సాన్ డియొగోలోని ఓ రోడ్డుపై కరెన్సీ నోట్లు కుప్పలుతెప్పలుగా కనిపించాయి. వీటిని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత తేరుకుని ఆ నోట్లను ఏరుకునేందుకు ఎగబడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ కంటైనర్ లారీ నోట్ల కట్టలతో లోకల్ బ్యాంకు నుంచి ఫెడరల్ బ్యాంకుకు బయలుదేరింది. మార్గమధ్యంలో కంటైనర్ లారీకి ఉన్న డోర్ ఒక్కసారిగా తెరుచుకుంది. అంతే అందులో ఉన్న నోట్ల కట్టలు, కరెన్సీ నోట్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయింది. ఈ విషయాన్ని కంటైనర్ డ్రైవర్ లేదా క్లీనర్ గమనించలేదు. 
 
దీంతో ఆ రోడ్డుపై వెళుతున్న వారు తమ వాహనాలను రోడ్డుపక్కన పార్కింగ్ చేసి ఆ కరెన్సీ నోట్లను ఏరుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత జరిగిన విషయం గ్రహించిన కంటైనర్ లారీ డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి రోడ్డుపై పడిన డబ్బును సేకరించి కంటైనరులో వేశాడు. 
 
అదేసమయంలో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రోడ్డుపై వాహనాలు నిలబడకుండా చర్యలు తీసుకున్నారు. కొందరు మాత్రం కరెన్సీ నోట్లను పోలీసులకు అప్పగించగా, మరికొందరు మాత్రం ఇదే అదునుగా కరెన్సీ నోట్లను తీసుకుని జారుకున్నారు.