బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (19:01 IST)

జూన్ 5న తగ్గిపోనున్న భూభ్రమణ వేగం... ఎలా? ఎందుకని?

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టుుకూడా తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు. తద్వారా మనకు రాత్రి, పగలు అనేవి వస్తుంటాయి. అయితే, భూమి తన చుట్టు తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అదే సూర్యుడ్ని చుట్టి రావడానికి 365 రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో భూమి 930 మిలియన్ కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంటుంది.
 
కానీ, ఈ వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రతి ఏడాది జులై 2వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యన భూభ్రమణ వేగం మందగిస్తుందట. దీన్ని ఎపిలియన్ అంటారు. ముఖ్యంగా, జులై 5న ఈ వేగం అత్యంత కనిష్ఠానికి చేరుకుంటుందని పరిశోధకులు గుర్తించారు. 
 
ఎందుకంటే సూర్యుడి శక్తి ఆధారంగానే భూభ్రమణం చెందుతుంది. జులై 2 నుంచి 7వ తేదీ మధ్యలో భూమి సూర్యుడి నుంచి అత్యంత దూరంగా వెళ్లిపోతుంది. దాంతో తక్కువ శక్తి పొందిన కారణంగా భూమి వేగం బాగా తగ్గిపోతుంది.
 
ప్రఖ్యాత జర్మన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు జోహాన్నెస్ కెప్లర్ గ్రహ గమన సూత్రాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గ్రహాలు సూర్యుడికి దూరంగా ఉన్నప్పటి కంటే, దగ్గరగా వచ్చినప్పుడు వేగంగా పరిభ్రమిస్తాయని కెప్లర్ వెల్లడించాడు.