1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. As a director, I haven't fallen behind: Tharun Bhascker

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

Tharun Bhascker
Tharun Bhascker
నేను దర్శకుడుగానే ఎక్కువ ఇష్టపడతాను. మన క్రియేటివిటీ నుంచి వచ్చిన ఒక కథని తెరపై చూడడంలో ఉన్న ఆనందం మరి ఎందులో రాదు. యాక్టింగ్ లో చాలా మంచి పేరు వస్తుంది కానీ పర్సనల్ క్రియేటివ్ సాటిస్ఫేషన్ ఇచ్చేది మాత్రం డైరెక్షనే. అంటూ తరుణ్ భాస్కర్ అన్నారు. ఇటీవలే రిషా రెబ్బ తో ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటుడిగా నటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
- ఒక సీన్ లో ఈషా రెబ్బను నిజంగానే కొట్టాలి. డైరెక్టర్  కొడితేనే ఆ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పాడు. తనకి తెలియకుండానే నిజంగా కొట్టాను. పాపం తను ఏడ్చేసింది. ఆ షాట్ సింగిల్ టేక్ లో ఓకే అయింది కాబట్టి మేము అందరం బ్రతికిపోయాం. రీటేక్ అని చెప్పి ఉంటే మాత్రం ఉంటే మాత్రం కష్టమే
 
- దర్శకుడిగా నా నుంచి ఆడియన్స్ ఎక్కువ సినిమాలు ఆశిస్తున్నారు.. నేను కూడా అంచనాలు వేసుకున్నాను. నేను ఏ సంవత్సరంలో వచ్చాను, ఏ ప్రాజెక్ట్ చేశాననేది  పేపర్ పై రాసుకున్నాను నాతోపాటు వచ్చిన డైరెక్టర్స్ అందరూ చూసుకుంటే నేను వెనకబడ్డట్టుగా ఏమి అనిపించలేదు. నాలుగు సినిమా చేశాను.  ఇంకో సినిమా సైనప్ లో ఉంది. టీవీ షో, ఇతర సినిమాలు కు డైలాగ్స్, కథ ఓకే చేసి ప్రొడక్షన్ చేయించడం, నటించడం  చాలా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ జర్నీ మీద నాకు ఎలాంటి రిగ్రేట్ లేదు. ఈ ఏడాది నేను నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. వీటి తర్వాత నేను దర్శకత్వం మీద పూర్తిగా ఫోకస్ చేస్తాను.  
 
- కొత్తగా ఈ నగరానికి ఏమైంది రిపీట్ చిత్రం షూటింగ్ చేస్తున్నా.
-ఈరోజు కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ సీన్ షూట్ చేశాము. తొలి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా స్కేల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము.  
 
- అలాగే  వెంకటేష్ గారితో చేయాలనుకునే సినిమా వుంది. దానికి ఇంకా సమయం పడుతుంది. కథపై ఇంకా వర్క్ చేయాలి.  
 
- నాకు ఎలాంటి కథలు ఇష్టమంటే...  ఒకటే జోనర్ కి ఫిక్స్ అవ్వాలని లేదు. కామెడీ మీద పట్టు వచ్చిందని అనుకుంటున్నాను. గ్యాంగ్ స్టార్, క్రైమ్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇలా చాలా సినిమాలు చేయాలని ఉంది. అలాగే ఒక రొమాంటిక్ కామెడీ కూడా చేయాలనుంది అని తెలిపారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ