1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. A recent update on Tarun Bhaskar and Eesha Rebba's marriage!

Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ పెండ్లి విషయంపై తాజా అప్ డేట్ !

Tarun Bhaskar, Eesha Rebba
Tarun Bhaskar, Eesha Rebba
ఓం శాంతి శాంతి శాంతిః' లో శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అని ఈషా రెబ్బ తెలియజేస్తున్నారు. తరుణ్ భాస్కర్ తో షూటింగ్ లోనే ప్రేమ పరిపక్వత చెందిందని చిత్ర యూనిట్ నుంచి వార్త బయటకు వచ్చింది. ఈ విషయమై దర్శకుడు A R సజీవ్ ముందు ప్రస్తావన వస్తే, అది తనకు తెలీదని తన షూటింగ్ తన పేమిటో తాను చూసుకునేవాడిననీ ప్రేమ సన్నివేశాల్లో వారు సహజంగా నటించేలా చిత్రానికి వన్నె తెచ్చారని క్లారిటీ ఇచ్చాడు.
 
అనంతరం జరిగిన వేడుకలో ఈషా కూడా పక్కనే వుండగా.., ఈషా ఈమీరంటే నాకు చాలా ఇష్టం. కాస్టింగ్ గురించి చర్చిస్తున్నప్పుడు ఆమే గుర్తుకువచ్చింది. అంతకుముందు నెట్‌ఫ్లిక్స్‌లో ‘రాముల’ చేసేటప్పుడు కూడా ఈషానే పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఆమె అప్పటికే వేరే ఆంథాలజీలో భాగమైంది అని తెలిపారు.
 
అనంతరం ఈషా రెబ్బ స్పందిస్తూ.. దర్శకుడు సజీవ్ నాకు కథ చెబుతున్నారు. వెంటనే తెలిసిన కథే కదా నాకెందకు చెబుతున్నావ్. అంటూ నవ్వుతూ తన ఆనందాన్ని వెలిబుచ్చింది. ఇది విన్న దర్శకుడు. ఏమిటి. మేడమ్.. మీరు.. అంటూ చిన్నగా సంజ్జ చేశారు. అది చూసిన వారు.. ముందుగానే తరుణ్ భాస్కర్ స్టోరీ చెప్పివుంటాడని కామెంట్లు వినిపించాయి.
 
ఇదిలా వుండగా, నిన్న జరిగిన ఈషా ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ ప్రేమ గురించి వ్యాఖ్యానిస్తూ.. అలాంటిది ఏమీ లేదు. మీ మిద్దరం పెండ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అదంతా అవాస్తం. గాసిప్ మాత్రమే. నన్ను తల్లిదండ్రులు పెండ్లిచేసుకోమంటున్నారు. సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ ఇప్పుడు వద్దనీ కెరీర్  ఇంకా గ్రోత్ అవ్వాలని తెలిపానని అన్నారు.
 
కాగా, ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విడుదల తర్వాత వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమేరకు వుందో ప్రేక్షకులు తెలియజేస్తారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్: చిరంజీవి గారు వేరే తరం నుండి వచ్చారు.. ఇప్పుడు పరిస్థితి వేరు.. చిన్మయి