బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 నవంబరు 2021 (11:29 IST)

గ్యాస్ లీక్: ముగ్గురు వ్యక్తులను పొట్టనబెట్టుకున్న సిలిండర్

నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో ఘోరం జరిగింది. ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
 
గ్యాస్ లీక్ అవుతుందన్న విషయాన్ని పసిగట్టలేకపోవడంతో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అబ్బాస్, అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారి కుమార్తె అయేషా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.