1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (13:31 IST)

నెల్లూరు నీట మునక : ప్రమాదకరంగా జలాశయాలు - ఉధృతంగా పెన్నానది

నెల్లూరు జిల్లా నీట మునిగింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న కుండపోత వర్షాలలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకునివున్నాయి. ఈ జిల్లాలోని అన్ని జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. వీటిలో అనేకం ప్రమాదకరంగా ఉన్నాయి. కట్టలు తెగి ఎపుడు ఊర్లపై పడుతాయోనన్న ఆందోళనలో స్థానిక ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
ముఖ్యంగా, జిల్లాలోని కండలేరు, సోమశిల డ్యామ్‌ల నుంచి భారీ మొత్తంలో నీటిని కిందికి విడుదల చేశారు. దీనికితోడు వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పొలాలన్నీ నీట మునిగివున్నాయి. 
 
అలాగే, ఇళ్లచుట్టూత నీళ్లు వచ్చిచేరాయి. ఎటు చూసినా నీళ్లు కంటికి కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. దీంతో మూగ జీవాలు మేత లేక అల్లాడుతున్నాయి. ఈ జిల్లాలోని జాతీయ రహదారి 16పై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. 
 
ప్రస్తుతం సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. జలాశయానికి 96569 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 115396 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలివేశారు. దీంతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది.