తాగి రచ్చ చేస్తారా.. బుద్ధుందా... సిగ్గుందా? ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. ఈ జిల్లా అనేక ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని వరద ముంపు బాధితులు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను పరామర్శించేందుకు కోవూరు అధికార వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురువారం పలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన వరద బాధితులపై రెచ్చిపోయారు. పిచ్చి మందు తాగేసి మీ ఇష్టంవచ్చినట్టు రచ్చ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క జిల్లా మంత్రి మన వద్దకు వస్తే డౌన్ డౌన్ అంటారా నిలదీశారు. బుద్ధివుందా.. సిగ్గుందా అంటూ ఫైర్ అయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిని చూపిద్దామని ఇక్కడకు తీసుకొస్తే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారా? అరిచినంత మాత్రాన ఏమొస్తుంది అంటూ నిలదీశారు.