బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 27 నవంబరు 2021 (10:18 IST)

వ‌ర‌ద ప్రాంతాల్లో పర్య‌టిస్తున్న కేంద్ర బృందం, పంట న‌ష్టం అంచ‌నా!

వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో రాయ‌ల‌సీమ‌లో తుపాను బీభ‌త్సంతో పంట‌లు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. వీటిని ప‌రిశీలించి పంట‌న‌ష్టం అంచ‌నా వేయ‌డానికి కేంద్ర బృందాలు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నాయి. క‌డ‌ప‌, క‌ర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కేంద్ర అధికారులు ప‌ర్య‌టిస్తున్నారు.
 
 
ముందుగా చిత్తూరు జిల్లాలో ఈ బృందాలు చంద్రగిరి మండలం, భీమవరం, కూచివారి పల్లి వరి పంట న‌ష్టాన్ని పరిశీలించాయి. కేంద్ర బృందం సభ్యులు ఇక్క‌డి రైతులతో మాట్లాడారు. రెండు గ్రామాల్లో 180 కుటుంబాల్లో  32 కుటుంబాలకు పూర్తి పంట నష్టం వాటిల్లిందని గుర్తించారు. పంట చేతి కోచ్చే కోత సమయంలో నష్టం జరిగిందని నిర్ధారించుకున్నారు. అలాగే  బీమా నది పరివాహక ప్రాంతంను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం దృష్టికి కలెక్టర్ భారీ వర్షాలకు సంబంధించిన విషయాలను తెలియజేశారు.
 
 
ఇదే పరిస్థితి పుంగనూరు నుండి నది, ఏరు పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగిందన్నారు. వరద నీటిలో వరి, వేరుశెనగ పంటలను  తీసుకువచ్చి బృందానికి రైతులు విన్నవించుకున్నారు. పంట‌న‌ష్టాన్ని న‌మోదు చేస్తున్నామ‌ని, అంచ‌నాలు కేంద్రానికి నివేదిస్తామ‌ని అధికారుల బృందం పేర్కొంది.