బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ , శనివారం, 4 డిశెంబరు 2021 (10:54 IST)

పెద్దలు రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది...

మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశ‌య్య మ‌ర‌ణ వార్త‌పై ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రోశ‌య్య ఉన్న‌పుడే, కాంగ్రెస్ జ‌రిగిన ప‌రిణామాలు వై.ఎస్. జ‌గ‌న్ రాజ‌కీయ అడుగుల‌ను నిర్దేశించాయి.


జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లు, కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠానం సోనియా గాంధీ ఆంక్ష‌లు మ‌ధ్య అటు జ‌గ‌న్, ఇటు సీఎంగా రోశయ్య న‌లిగిపోయారు. వారి మ‌ధ్య ఎన్నో రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రిగేవ‌ని అప్ప‌ట్లో మీడియా వార్త‌లు వెలువ‌డ్డాయి. అలాంటి, కురు వృద్ధుడు రోశ‌య్య మృతిపై సీఎం జ‌గ‌న్ స్పంద‌న ఇలా ఉంది.
 
 
పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను....అని సీఎం జ‌గ‌న్ త‌న సంతాప సందేశాన్ని ఇచ్చారు.