బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 డిశెంబరు 2021 (09:53 IST)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇక లేరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇక లేరు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన రోశయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం ఆయన రక్తపోటు పడిపోవడంతో బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఆయన వయసు 88 ఏళ్లు.

 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 15వ ముఖ్యమంత్రి
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కార్యాలయంలో అతని పదవీకాలం సెప్టెంబర్ 3, 2009న ప్రారంభమై, నవంబర్ 24, 2010తో ముగిసింది. గతంలో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

 
జూన్ 28, 2014న కర్ణాటక గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం ఆగస్టు 31, 2014తో ముగిసింది. ఆయన కర్ణాటక గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

 
తమిళనాడు 13వ గవర్నర్
తమిళనాడు గవర్నర్‌గా ఆగస్టు 31, 2011 నుండి ఆగస్టు 30, 2016 వరకు పని చేసారు. తమిళనాడు గవర్నర్‌గా పదవీకాలం పూర్తయిన తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయ జీవితం దాదాపు 60 ఏళ్లు కొనసాగింది.