పుష్ఫ సినిమాకు వై.ఎస్. జగన్ ఆశీర్వాదాలు
అల్లు అర్జున్ తాజా సినిమా `పుష్ప`. ఈ సినిమా ఈనెల డిసెంబర్‌లోనే విడుదల కాబోతోంది. రెండు భాగాలతో రూపొందిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. విశేషం ఏమంటే, త్వరలో విడుదల కాబోయే పుష్ప సినిమా విజయవంతం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ట్వీట్‌లో ఆశీస్సులు అందజేశారు. గురువారంనాడు ఆయన తన ట్విట్టర్ తెలియజేయడానికి కారణం కూడా వుంది.
ఈరోజే అల్లు అర్జున్ ఆంధ్రలోని వరద బాధితులకోసం సి.ఎం. రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షలు అందజేశారు. గతంలోనూ ఆయన పలు విధాలుగా సహకరించారు. కరోనా సమయంలోనూ ఎంతగానో ఆదుకున్నారు. ఈ సందర్భంగా వెంటనే ప్రతి స్పందిస్తూ వై.ఎస్. జగన్ ట్వీట్ చేయడం గొప్ప విషయం.
- ఈ సందర్భంగా గౌరవపూర్వంగా మాకు ఆశీస్సులు అందించిన జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్.
నిన్న ఎన్.టి.ఆర్.తో మొదలైన ఈ విరాళం ప్రక్రియ మహేష్‌బాబుతోపాటు పలువురు స్పందించారు. ఇంకా సినిమారంగంలో పలువురు సి.ఎం. రిలీఫ్ పండ్‌కు విరాళం అందజేశారు. కానీ చాలామంది విరాళం బయటకు చెప్పకూడదన్నట్లుగా గుంబనంగా వున్నారు.