సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (16:49 IST)

అఖండ ప్రీరిలీజ్‌కు అల్లు అర్జున్ - మ‌రి ఆచార్య ప్రీరిలీజ్‌కు గెస్ట్ ఎవ‌రో తెలుసా!

Acharya
అఖండ విడుద‌లైంది. త‌దుప‌రి పుష్ప‌, అనంత‌రం ఆచార్య వ‌రుస‌గా వున్నాయి. ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. మొన్న‌నే రిలీజైన సిద్ధ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకే ఈ సినిమా ప్రీరిలీజ్‌ను గ్రాండ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దర్శకుడు కొరటాల శివ ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మ‌రి గెస్ట్ ఎవ‌ర‌నేది స‌స్పెన్స్‌గా వుంచారు. బాల‌కృష్ణ ఫంక్ష‌న్ కు అల్లు అర్జున్ వ‌చ్చి స‌క్సెస్ చేశాడు. ఇప్పుడు ఆచార్య‌కు వ‌చ్చే గెస్ట్‌గా అంతే రేజ్‌లో వుండాల‌ని అనుకుంటారు. క‌నుక‌నే ఎన్‌.టి.ఆర్‌. రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. కూడా సిద్ధం అవుతుంది.
 
ఎన్‌.టి.ఆర్‌. వ‌స్తేనే మంచి లుక్ వ‌స్తుంది. బ‌య‌ట‌కు ఎన్ని మాట‌లు అనుకున్నా సినిమావ‌ర‌కు వ‌చ్చే స‌రికి అంతా ఒక్క‌టే అనేది తెలిసిందే. పైగా ఎన్.టి.ఆర్‌.తో కొర‌టాల సినిమా చేయ‌నున్నాడు కూడా. సో. ఎటుచూసినా ఎన్‌.టి.ఆర్‌. చీఫ్ గెస్ట్ అనేది ఫిక్స్ అంటూ అభిమానులు చెబుతున్నారు.