మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (19:33 IST)

పుష్పలో సమంత స్పెషల్ సాంగ్.. పోస్టర్ వచ్చేసిందిగా..!

Pushpa
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కే పుష్పలో స్పెషల్ సాంగ్‌లో సమంత కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా రష్మిక కనువిందు చేయనుంది. 
 
ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో సమంత లుక్ ఎలా వుంటుందని ఎదురుచూసే ప్రేక్షకులకు సూపర్ పోస్టర్ వచ్చేసింది. 
 
ప్రత్యేకంగా వేసిన సెట్లో ఆ పాటకి సంబంధించిన చిత్రీకరణ జరుగుతూ ఉండగానే, అందుకు సంబంధించిన సమంత స్టిల్ కూడా బయటికి వచ్చింది. ఇక ఈ పాట లిరికల్ వీడియోను త్వరలో వదలనున్నారు. ఫస్టు పార్టులోనే ఈ పాటను వదులుతుండటం విశేషం. 
Pushpa
 
కాగా సుకుమార్ ఇంతకు ముందు చేసిన 'రంగస్థలం'లో హీరోయిన్ గా చేసిన సమంత, ఆయన తరువాత సినిమాకి స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే.