1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (20:32 IST)

సమంత హాలీవుడ్‌ సినిమా వెనుక రానా వున్నాడా? (Video)

Rana_Samantha
టాలీవుడ్‌ ప్రేమ పక్షులు సమంత-నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల తరువాత సమంత వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ గా ఉంది.

ఈ మధ్యనే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత .. తాజాగా ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది సామ్‌.
 
"అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్" అనే అంతర్జాతీయ సినిమాకు సమంత సైన్ చేసింది. భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన పుస్తకానికి నవలా రూపం ఈ చిత్రం. 
 
సమంత తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసి.. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే ఈ చిత్రంలో సామ్‌ బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది.
 
ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. సమంతను ఈ సినిమాకు రికమెండ్ చేసింది దగ్గుబాటి వారసుడు రానానే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.