మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 నవంబరు 2021 (19:33 IST)

చైతూతో డేటింగ్ చేసిన స్టార్ హీరోయిన్ రీ-ఎంట్రీ? అందుకే చైశామ్ విడాకులా?

సమంత-నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్లీ కపుల్ అని పేరు తెచ్చుకున్నారు. వారు అన్యోన్యంగా వున్నారని అంతా అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకుని ఎవరికివారు సినిమాల్లో బిజీ అయిపోయారు.

 
ఐతే వీరి గురించి మాత్రం నిత్యం సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే వుంది. తాజాగా మరో ఊహాగానం తిరుగుతోంది. సమంతను వివాహం చేసుకోబోయే ముందే నాగచైతన్యకు ఓ స్టార్ హీరోయినుతో ప్రేమాయణం వుందట. ఆమెతో డేటింగ్ కూడా చేసాడట. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి ఏదో సమస్య కారణంగా బ్రేకప్ అయ్యిందట. ఆ తర్వాత సమంతను అదే ఏడాదిలో నాగచైతన్య వివాహం చేసుకున్నాడట.

 
ఇప్పుడు తిరిగి ఆ స్టార్ హీరోయిన్ నాగచైతన్యతో టచ్ లోకి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. మరి ప్రచారంలో వున్న ఈ వార్త గాలివార్తో కాదో తెలియాల్సి వుంది.