మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (12:20 IST)

"పుష్ప" ట్రైలరుపై క్లారిటీ - డిసెంబరు 6న ఫిక్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర "పుష్ప". రష్మిక మందన్నా హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలి భాగాన్ని డిసెంబరు 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ చిత్రం ట్రైలర్ డిసెంబరు 6వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. 
 
ఎర్రచందన్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, 'పుష్ప'  ట్రైలర్ వేడుక దుబాయ్‌లో నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఇందులో మలయాళ నటుడు పహాద్ పాజిల్, సునీల్, యాంకర్ అనసూయలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో హాస్య నటుడు సునీల్ నటిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.