గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 నవంబరు 2021 (19:30 IST)

అఖండ Pre-Release: అల్లు ఫ్యాన్సుకూ పండగే... ఎందుకు?

అఖండ సినిమా రిలీజ్‌కు రంగం సిద్ధం అవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్​లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారని టాక్ వస్తోంది. 
 
ఈ నెల 27న ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సినీ యూనిట్ ప్లాన్ చేసింది. శిల్ప కలా వేదికలో శనివారం సాయంత్రం 6 గంటలకు కి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.
 
ఇకపోతే.. డిసెంబర్ 2న ఈ సినిమా థియేటర్లలో అఖండ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్లు మూవీపై హైప్​ పెంచేశాయి. బాలయ్య క్రేజ్​ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారు.