బాల కృష్ణ పారితోషికం తగ్గించుకున్నారా!
నందమూరి బాలకృష్ణ సినిమాలంటే హెవీ బడ్జెట్‌తో కూడుకున్నవే. దర్శకుడు కథ స్థాయిని మించి ఖర్చు పెట్టిస్తుంటాడు. నిర్మాతలు కూడా అదే స్థాయిలో వెచ్చిస్తుంటారు. బాలకృష్ణ రెమ్యనరేషన్ ఒకసారి ఫిక్స్ అయ్యాక చెప్పినట్లు ఇవ్వాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. నిక్కచ్చిగా వుండే బాలకృష్ణ అంతే నిక్కచ్చిగానే ముందుగా మాట్లాడే విధానం బట్టి ప్రవర్తన వుంటుంది.
అయితే అఖండ సినిమాకు అందుకు మినహాయింపు ఇచ్చాడని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీను లావిష్‌గా ఖర్చుపెట్టించారు. ఔట్‌పుట్ బాగుంటేనే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. అరుణాచలం లోని ప్రముఖ దేవాలయంలో షూటింగ్ చేయాల్సివుంది. అప్పుడే దేవాదాయ శాఖ మంత్రినిగా ఛార్జ్ తీసుకున్న మంత్రితో బాలకృష్ణ మాట్లాడి పర్మిషన్ ఇప్పించారు.
అఘోరా కు చెందిన పలు సన్నివేశాలు అక్కడ అద్భుతంగా తీశారు. ఇదిలా వుండగా, కరోనా సమయంలో రెండుసార్లు వాయిదా పడడంతో షూటింగ్ జాప్యం జరగడంతో నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డికు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దాంతో బాలకృష్ణ వాస్తవాన్ని తెలుసుకుని తన రెమ్యునరేషన్ తగ్గించుకుని చేశాడట. ఇందుకు నిర్మాత చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ విషయాన్ని తన సన్నిహితులవద్ద ఆయన వెల్లడించారు.
సో. ఏదిఏమైనా బాలకృష్ణ ప్రస్తుత పరిస్థితి చూసి రెమ్యునరేషన్ తగ్గించుకోవడం విశేషమే. ఇటీవలే పారితోషికాల విషయంతోపాటు పలు సమస్యల గురించి అగ్ర నిర్మాతలు ఫిలింఛాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య విషయంతెలుగులోకి రావడంతో వారంతా సమావేశంలో కరతాళద్వనులు చేశారని తెలిసింది.