గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (12:31 IST)

"ఆ పక్కా నాదే.. ఈ పక్కా నాదే.. తలపైన ఆకాశం నాదే" అంటున్న 'పుష్పరాజ్'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలి భాగం వచ్చే నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రంలోని పాటలను లిరికల్ సాంగ్‌ల రూపేణా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా "ఏ బిడ్డా.. ఇది నా అడ్డా" అనే పాటను విడుదల చేశారు. 
 
"ఆ పక్కా నాదే.. ఈ పక్కా నాదే.. తలపైన ఆకాశం" అంటూ ఈ పాట మొదలవుతుంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సంగీతం సమకూర్చగా, నకాజ్ అజీజ్ నేపథ్యగానం చేశారు. ప్రేమ్ రక్షిత్ - గణేష్ జంట కొరియోగ్రఫీ చేశారు. 
 
ఈ పాట పక్కా మాస్ స్టెప్పులతో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. రష్మిక హీరోయిన్ కాగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో ఈ కథ సాగనుంది.