శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (12:26 IST)

''అఖండ''కు బ్రహ్మరథం పడుతున్న పవన్ ఫ్యాన్స్... నిజమా?

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన సినిమా "అఖండ". సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, పోస్టర్లు, బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తుండటం ఈ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. 
 
తాజాగా సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే? పవర్ స్టార్ ఫ్యాన్స్ జై బాలయ్య నినాదాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇందుకు కారణం అఖండ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే. సోషల్ మీడియాలో ట్విట్టర్ల ఖాతాలతో పాటు పవన్ ఫ్యాన్స్ గ్రూపుల్లోనూ, పేజీల్లోనూ అఖండ సూపర్ హిట్ అని కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా అఖండకు సోషల్ మీడియాలో బూస్టప్ ఇస్తుండడం సినిమా వర్గాల్లో కూడా సంచలనంగా మారింది. 
 
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా మెగా హీరో అల్లు అర్జున్ స్వయంగా వచ్చారు. ఇక ఇప్పుడు పవన్ అభిమానులు కూడా సపోర్ట్ చేస్తుండడంతో సినిమాకు మరింత హైప్ వస్తోంది.
 
అఖండను మన వంతుగా ప్రమోట్ చేయాలన్న కామెంట్లు కనపడుతున్నాయి. ఏదేమైనా పెద్ద హీరోల అభిమానుల మధ్య ఈ తరహా వాతావరణం ఉండడం మంచి విషయమే. రేపటి రోజును పుష్ప వచ్చినా లేదా ఆర్ ఆర్ ఆర్ ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినా కూడా బాలయ్య , నందమూరి అభిమానుల సపోర్ట్ ఉండే ఆ సినిమాలకు మంచి ప్లస్ అవుతుంది.