ఆదివారం, 19 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2025 (19:05 IST)

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

child skin blisters
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వింత వ్యాధి ప్రబలుతుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఈ ఏరియాలోని ఓ చిన్నారికి వంటి నిండా బొబ్బలు వచ్చాయి. వీటిని చూసిన స్థానికులు హడలిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన ఓ చిన్నారికి ఈ వింత వ్యాధి సోకింది. ఒంటి నిండా బొబ్బలు రావడంతో ఆ చిన్నారి అవస్తలుపడుతూ అల్లాడిపోతోంది. 
 
అయితే, వైరస్ ప్రభావం కారణంగానే ఈ బొబ్బలు వచ్చాయనే ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులు తక్షణం స్పందించి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఆ చిన్నారి ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి అడ్డుకట్ట కోసం బ్లీచింగ్ పౌడర్‌తో శానిటైజేషన్ చేశారు. 
 
చిన్నారికి ఇన్ఫెక్షన్ రావడంపై ఉన్నతాధికారులు ఆరా తీసి విజయవాడ జీజీహెచ్‌కు తరలించి పరీక్షలు చేశారు. గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు. గ్రామంలో ఇంకా ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకిందేమోనని ఆరా తీస్తున్నారు. చిన్నారికి సోకిన ఇన్ఫెక్షన్‌‍పై ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలను వైద్యాధికారులు కోరారు.