ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (10:36 IST)

వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద ముంచెత్తింది. దీంతో అపార నష్టం ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి పర్యటించలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ గురువారం రాయలసీమ ప్రాంతంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 
 
ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఆయన గురు, శుక్రవారాల్లో పర్యటిస్తారు. గురువారం కడప, చిత్తూరు జిల్లాల్లో, శుక్రవారం అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు. సీఎం తన పర్యటనలో భాగంగా, భారీ వరద నీటి ప్రవాహానికి తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టును కూడా పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.