1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 2 డిశెంబరు 2021 (15:02 IST)

సీఎం ఇలాఖాలో అఖండ బెనిఫిట్ షో... అనుమ‌తి లేకుండానే!

బాల‌య్య సినిమానా మ‌జాకానా... సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇలాఖాలోనే అఖండ సినిమా బెనిఫిట్ షో వేశారు. అదీ ప‌ట్ట‌ప‌గ‌లు ప‌బ్లిక్ గా... ఎటువంటి ప్ర‌భుత్వ అనుమ‌తులు లేకుండా... అయినా ఎవ‌రూ ఎదురు చెప్ప‌లేదు. ద‌టీజ్ బాల‌య్య అంటున్నారు...అయ‌న అభిమానులు.
 
 
గుంటూరు జిల్లా  తాడేపల్లిలోని ఉండవల్లి సెంటరు రామకృష్ణ థియేటర్ లో అఖండ సినిమా బెనిఫిట్ షో వేశారు. బెనిఫిట్ షోల‌కు అనుమతి లేదంటూ, ప్రతిష్టాత్మకంగా ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది. కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వ‌చ్చాయి. అంటే, కొత్త నినిమాటోగ్రఫీ చట్టం అమ‌ల్లోకి వ‌చ్చింద‌న్న‌మాట‌. దీనిలో భాగంగా రాష్ట్రంలో బెనిఫిట్ షో అనుమతులకు ప్రభుత్వం నిరాకరించింది. 
 
అయినా, సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతంలోని  "రామకృష్ణ థియేటర్" లో బెనిఫిట్ షో వేశారు. బాల‌య్య బాబు అఖండ సినిమా బెనిఫిట్ షో వేసి, పంతం నెగ్గించుకున్నాడు  ఉండవల్లి సెంటరు "రామకృష్ణ థియేటర్" నిర్వాహకుడు. దీనితో అధికారులు నోరువెళ్ళ‌బెట్టి చోద్యం చూస్తుండిపోయారు. పైగా అధిక రేట్లతో బెనిఫిట్ షో టికెట్లను విక్రయించారు.


రామకృష్ణ థియాటర్ లో ఉదయం ఏడు గంటలకు అనుమతి లేకుండా అఖండ సినిమా బెనిఫిట్ షో వేశారు. పైగా థియేటర్లో పార్కింగ్ కి సైతం థియేటర్ నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొత్త చ‌ట్టం ప్ర‌కారం ప్రభుత్వం రోజుకు నాలుగు ఆటల ప్రదర్శన మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ బోర్డులో 5 ఆటలు వేస్తున్నట్టు థియేటర్ యజమాని తెలిపారు.