ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (10:37 IST)

కొచ్చి ఎయిర్‌పోర్టు రోడ్డుపై కొండ చిలువ.. వీడియో వైరల్

కొచ్చి ఎయిర్‌పోర్టు రోడ్డుపై కొండ చిలువ కనపబడటంతో జనాలు షాకయ్యారు. కొచ్చి ఎయిర్‌పోర్టు రోడ్డుపై మెరుపు వేగంతో దూసుకెళ్లే వాహనాలు కొద్ది నిమిషాల పాటు స్తంభించిపోయాయి. 
 
ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్ పడకపోయినా వాహనదారులు అట్టే ఆగిపోయారు. కేఎస్ఈబీ ఆఫీసు సమీపంలో రాత్రి 11.10నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. రెండు మీటర్ల పొడవుండే కొండ చిలువ నిదానంగా రోడ్డును దాటుకుంటూ పోయింది. 
 
కొండచిలువ అలా రోడ్డు దాటేందుకునాలుగైదు నిమిషాల సమయం పట్టింది. ఆ పాము ఏ వాహనం చప్పుడుకు భయపడలేదు. వాహనాలు వెళ్తున్నప్పటికీ ముందుకు వెళ్తూనే ఉంది. అలా పొదల్లోకి వెళ్లి క్షణాల్లో కనిపించకుండాపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.