మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 10 జనవరి 2022 (18:35 IST)

Fact Check: దుమ్ము లేపుతూ విమానం క్రాష్ ల్యాండింగ్, వైరల్ వీడియో

సోషల్ మీడియాలో ఒక్కోసారి ఏది నిజమో ఏది అబద్దమో తెలియని స్థితి కనబడుతోంది. వైరల్ వీడియో అంటూ కొన్ని వీడియోలను కొందరు షేర్ చేస్తూ... ఇదిగో ఇప్పుడే జరిగిందంటూ ఫార్వోర్డ్ చేస్తుంటారు. కొన్నిసార్లు అన్ని తెలిసి కూడా బోల్తా పడుతుంటాం. అలాంటి వీడియో ఒకటి సోమవారం చక్కెర్లు కొడుతోంది.

 
ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన 36 సెకన్ల నిడివి గల వీడియో ఒకటి పేరులేని విమానాశ్రయంలో గరుడ ఇండోనేషియా విమానం ఎగుడుదిగుడుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అవుతున్నట్లు చూపించింది. విమానం నుండి పొగలు రావడంతో అంతా గట్టిగా ఊపిరి పీల్చుకున్నారంటూ అందులో వుంది. అసలు ఆ వీడియోలో చూపించినది నిజమేనా?

 
ఫాక్ట్ చెక్ ప్రకారం, వీడియో X-Plane11 అనే ఫ్లైట్ సిమ్యులేటర్ గేమ్‌ను ఆడుతున్న వ్యక్తి చేసిన రికార్డింగ్. మే 1, 2020న అప్‌లోడ్ చేయబడిన "మోస్ట్ క్రేజీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ బై డ్రంక్ పైలట్ X-ప్లేన్ 11" అనే వీడియోలో దీన్ని అప్ చేసాడు. అది కేవలం గేమ్ ఆడుతున్న వ్యక్తి రికార్డింగ్.


ఇది కాస్తా సోమవారం నాడు జరిగిందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. చివరికి ఇది ఓ Fake Video అని తేలింది. కనుక సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మకూడదని ఇందుమూలంగా తెలుసుకోవాల్సిన అవసరం వుంది. చూడండి ఆ ఫేక్ వీడియో...