సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (13:18 IST)

పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే అంటోన్న డేవిడ్ వార్నర్

David warner
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ దక్షిణాది పాటలకు స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాడు. తాజాగా తెలుగు డైలాగ్ చెప్పేసి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్ట బొమ్మసాంగ్‌కు ఆడిపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. తాజాగా పుష్ప అవతారమెత్తేశాడు.
 
ఇప్పటికే "ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా" అంటూ ఉర్రూతలూగించిన వార్నర్.. మళ్లీ ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే’అంటూ హల్ చల్ చేశాడు. ఇన్ స్టాలో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ ఆ వీడియోకు రిప్లై ఇచ్చాడు. ‘డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదేలె’ అంటూ కామెంట్ చేశాడు. రవీంద్ర జడేజా కూడా దానిపై కామెంట్ పెట్టాడు. తనంత మంచోడైతే కాదంటూ వ్యాఖ్యానించాడు.
 
కొందరు అభిమానులు వార్నర్ వీడియోకు ఆసక్తికర కామెంట్లు పెట్టారు. భారత పౌరసత్వం తీసుకోవచ్చు కదా? అని ఓ అభిమాని అడగ్గా.. అందుకు తానేం చేయాలో చెప్పాలంటూ వార్నర్ బదులుగా ప్రశ్నించాడు.