సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

'పుష్ప' చిత్రం దిగువస్థాయి టెక్నీషియన్లకు నగదు బహుమతి

"పుష్ప" చిత్రం కోసం పని చేసిన కిందిస్థాయి టెక్నీషియన్లు, సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు కె.సుకుమార్ వెల్లడించారు. ఇది ఆ చిత్రంలోని పనిచేసిన దిగువస్థాయి టెక్నీషియన్లను ఎంతో ఆనందానికి గురిచేసింది. 
 
ఈ నెల 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా మూవీగా రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం థ్యాంక్స్‌ మీట్‌ను చిత్ర బృందం నిర్వహించింది. 
 
ఇందులో దర్శకుడు కె.సుకుమార్ పాల్గొని మాట్లాడుతూ, 'పుష్ప' కోసం పని చేసిన దిగువస్థాయి టెక్నీషియన్లు అయిన లైట్‌బాయ్, సెట్ సిబ్బంది, ప్రొడక్షన్ సిబ్బంది ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ఈ థ్యాంక్స్ మీట్‌కు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా కూడా హాజరయ్యారు.