శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (09:59 IST)

"పుష్ప" బృందానికి చిరు విషెస్- సినిమా కోసం చెమట చిందించారంటూ ట్వీట్

అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "పుష్ప". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తయారు చేసిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సమంత ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించారు. 
 
ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతుండగా, మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి తన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఈ చిత్రం కోసం మీరు మీ చెమటను చిందించారు. ఎంతో నిబద్ధతతో పని చేశారు. మీరు సినిమా కోసం చేసిన ప్రయత్నాలు అన్ని అభినందనీయం" అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలన్నీ ఐదు భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదేసమయంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రం కోసం యూనిట్ సభ్యులు పడిన కష్టాలను నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకుడు ఏకరవుపెట్టిన విషయం తెల్సిందే.