సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (17:21 IST)

'పుష్ప'రాజ్‌కు అనుకూలంగా టీ సర్కారు నిర్ణయం... 5వ ఆటకు ఓకే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన "పుష్ప" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం విడుదల రోజు నుంచి రెండు వారాల పాటు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీచేసింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సమంత ఒక ఐటమ్ సాంగ్‌లో నటించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం కావడంతో దాదాపు రెండు వారాల పాటు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.